ETV Bharat / sports

ఐపీఎల్​ నిష్క్రమణ తర్వాత తొలిసారి రైనా ట్వీట్లు.. - సురేశ్​ రైనా ఐపీఎల్​

పంజాబ్​లో తమ కుటుంబానికి ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా. తమ మామయ్యను హత్య చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాడు. ఐపీఎల్​ నిష్క్రమణ తర్వాత తొలిసారి రైనా ఈ ట్వీట్లు చేశాడు.

raina
రైనా
author img

By

Published : Sep 1, 2020, 1:18 PM IST

Updated : Sep 1, 2020, 1:55 PM IST

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వైస్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాక తొలిసారి నోరు విప్పాడు. పంజాబ్‌లో తమ కుటుంబంలో చోటుచేసుకున్న దుర్ఘటనపై స్పందించాడు. అక్కడ జరిగింది దారుణం కంటే ఘోరమని ట్విట్టర్​ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

"పంజాబ్‌లో మా కుటుంబానికి జరిగింది దారుణం కన్నా ఘోరం. మా మామయ్య హత్యకు గురయ్యారు. మా మేనత్త, వాళ్ల ఇద్దరు కుమారులు తీవ్ర గాయాలపాలయ్యారు. దురదృష్టం కొద్దీ గత రాత్రి మరొకరు కన్నుమూశారు. ఇప్పటికీ మా అత్తయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు"

-- సురేశ్​ రైనా, భారత మాజీ క్రికెటర్​

అనంతరం మరో ట్వీట్‌లో.. "ఆరోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై మాకెవరికీ సమాచారం లేదు. ఎవరు చేశారో తెలియదు. ఈ విషయంపై పంజాబ్‌ పోలీసులు త్వరగా దర్యాప్తు చేయాలని కోరుతున్నా. వాళ్లని ఇంతలా క్రూరంగా హింసించిన వాళ్లెవరో మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ నేరస్థులు మరిన్ని ఘోరాలు చేయడానికి అవకాశం ఇవ్వొద్దు" అని పంజాబ్‌ సీఎంను ట్యాగ్‌ చేశాడు రైనా.

ఈ దుర్ఘటన కారణంగానే రైనా తిరిగి స్వదేశానికి వచ్చినట్లు ఈ ట్వీట్లతో అర్థమవుతోంది.

ఇది చూడండి 'ఈ స్వర్ణంతో అయినా చెస్​ ప్లేయర్లను గుర్తించాలి'

Last Updated : Sep 1, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.