కరోనా కారణంగా క్రికెట్‌కు దూరమైన ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇన్నిరోజులు ఇంటికే పరిమితమైన క్రికెటర్లు ఔట్‌డోర్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా టీమ్ఇండియా క్రికెటర్ సురేశ్ రైనాతో కలిసి ప్రాక్టీస్‌ను ఆరంభించాడు యువ క్రికెటర్ రిషభ్ పంత్. వీరిద్దరూ ఘజియాబాద్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు రైనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో రైనా, పంత్ ఇద్దరూ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. రైనా కొంతకాలంగా ఘజియాబాద్ క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేస్తుండగా.. తాజాగా పంత్ కూడా రైనాతో కలిశాడు. రాహుల్ కీపర్‌గా విజయవంతం అయ్యాక జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు పంత్. అలాగే రైనా కూడా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం శ్రమిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రైనా, పంత్ ఐపీఎల్లో రాణించి జట్టులోకి రావాలని చూస్తున్నారు. కానీ కరోనా కారణంగా ఈ లీగ్ వాయిదా పడింది. ఏది ఏమైనా ఈ ఏడాది మాత్రం లీగ్ కచ్చితంగా జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. దీంతో ఆటగాళ్లు శిక్షణపై దృష్టి పెట్టారు.