ETV Bharat / sports

బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా సునీల్​ జోషి - టీమిండియా మాజీ లెప్టార్మ్​ స్పిన్నర్​ సునీల్​ జోషి

టీమిండియా మాజీ లెఫ్టార్మ్​ స్పిన్నర్​ సునీల్​ జోషి.. బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా ఎంపికయ్యాడు. ప్యానెల్​ సభ్యుడిగా మాజీ పేస్​ బౌలర్ ​హర్విందర్​సింగ్​ నియామకం అయ్యాడు.

sunil joshi_
బీసీసీఐ సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా సునీల్​ జోషి
author img

By

Published : Mar 4, 2020, 6:25 PM IST

భారత క్రికెట్​ జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​గా టీమిండియా మాజీ లెప్టార్మ్​ స్పిన్నర్​ సునీల్​ జోషి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేడు(బుధవారం) బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

మాజీ క్రికెటర్లు మదన్‌లాల్‌, ఆర్​పీ సింగ్‌, సులక్షన కులకర్ణి నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్‌ సలహా మండలి... సెలక్షన్‌ కమిటీ కొత్త ఛైర్మన్‌గా సునీల్‌ జోషి పేరును ఖరారు చేసింది. పదవీ కాలం ముగిసిన ప్రస్తుత సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంఎస్​కే ప్రసాద్‌ స్థానంలో జోషి బాధ్యతలు చేపడతాడు.

పదవీ కాలం ముగిసిన మరో సెలక్షన్‌ కమిటీ సభ్యుడు గగన్‌ ఖోడా స్థానంలో టీమిండియా మాజీ పేస్‌ బౌలర్‌ హర్విందర్‌ సింగ్‌ ఎంపికయ్యాడు.

ఈ ఎంపికను అసాధారణంగా పేర్కొన్న క్రికెట్‌ సలహా మండలి ఏడాది తర్వాత వీరి పనితీరుపై సమీక్ష చేసి తగిన సూచనలు అందజేస్తామని తెలిపింది.

సెలక్షన్‌ కమిటీలో వీరితో పాటు జతిన్‌ పరంజపే, దేవాంగ్‌ గాంధీ, శరణ్‌ దీప్‌ సింగ్‌ కొనసాగనున్నారు.

ఇదీ చూడండి : అలాంటి ప్లేయర్​ ప్రతి జట్టుకు కావాలి: హర్మన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.