ETV Bharat / sports

పృథ్వీషా ఎంపికపై ముందుగానే ప్రశ్నించిన మాజీలు!

టీమ్ఇండియా యువ క్రికెటర్​ పృథ్వీషా ఆటతీరుపై గతంలోనే మాజీలు హెచ్చరించారు. పృథ్వీషా విషయంలో వారు అనుకున్నదే నిజమైంది. ఆసీస్​తో తొలిటెస్టులో రెండో బంతికే ఔటైన ఈ యువ క్రికెటర్​పై భారత అభిమానులు మండిపడుతున్నారు. ప్రాక్టీసు మ్యాచ్​ల్లో సరిగా రాణించని ఆటగాడిని తుదిజట్టులో ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Sunil Gavaskar tears into India openers after failure in 1st Test
పృథ్వీషా ఎంపికపై ముందుగానే ప్రశ్నించిన మాజీలు!
author img

By

Published : Dec 18, 2020, 7:41 AM IST

అడిలైడ్‌లో తొలి టెస్టుకు రెండ్రోజుల ముందు దిగ్గజ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యానాలు టీమ్‌ఇండియా తుది జట్టు కూర్పులో జరిగిన పొరపాటును చెప్పకనే చెప్తున్నాయి. దాని పర్యవసానం మ్యాచ్‌ ప్రారంభమైన అయిదు నిమిషాల్లోపే చూశాం. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌.. రెండో బంతికే ఓపెనర్‌ పృథ్వీ షా బౌల్డ్‌. మిచెల్‌ స్టార్క్‌ ఇన్‌స్వింగర్‌ను డ్రైవ్‌ చేసేందుకు ప్రయత్నించి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు.

గావస్కర్​ చెప్పినట్లుగానే..

కరోనా విరామం తర్వాత ఆస్ట్రేలియాలో భారత జట్టు తొలి టెస్టు ఆడుతోంది. మొదటి టెస్టే డేనైట్‌ మ్యాచ్‌. గులాబి బంతితో తక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేయడం ఎంతో అవసరం. తీక్షణంగా పిచ్‌ను అధ్యయనం చేయాలి.. ఏకాగ్రతతో బౌలర్లను చదవాలి! పృథ్వీకి మాత్రం ఇవేవీ పట్టనట్లుంది. వచ్చాడు.. ఔటయ్యాడు.. వెళ్లాడు! అతడి ఈ లక్షాణాన్నే గావస్కర్‌ తప్పుబట్టాడు. మ్యాచ్​కు రెండు రోజుల ముందే పృథ్వీషా ఎంపికపై మాజీలు ఈ విధంగా స్పందించారు.

"పృథ్వీ షా బ్యాటింగ్‌ శైలి మారకపోతే అతడు నిలకడైన బ్యాట్స్‌మన్‌గా ఎదగలేడు. పిచ్‌ ఎలా స్పందిస్తుంది.. బౌలర్లు ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే కొద్దిసేపు క్రీజులో గడపాలి."

- సునీల్‌ గావస్కర్‌, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

"కేఎల్‌ రాహుల్‌ నా మొదటి ప్రాధాన్యం" - వీవీఎస్‌ లక్ష్మణ్‌

పిచ్‌ను చదవకుండా.. బౌలర్ల వ్యూహాల్ని గమనించకుండా బ్యాటింగ్‌ చేయడం సరికాదనిని గావస్కర్​ స్పష్టంగా చెప్పాడు. ఆయన హెచ్చరిక తర్వాత కూడా పృథ్వీ ఆటలో మాత్రం ఏమార్పు లేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో పృథ్వీ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో 17.53 సగటుతో 228 పరుగులు మాత్రమే చేశాడు. ఆసీస్‌ గడ్డపై జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ సాధించిందేమీ లేదు. తొలి మ్యాచ్‌లో 0, 19.. రెండో పోరులో 40, 3 .. ఇవీ అతడి స్కోర్లు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న పృథ్వీని తుదిజట్టులోకి ఎలా ఎంపిక చేశారన్నదే అసలు ప్రశ్న.

వారికి అవకాశం ఇవ్వాల్సింది!

ఆసీస్‌లో ఎలాంటి సిరీస్‌ అయినా పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లతో కూడిన జట్టుతో బరిలో దిగడం అవసరం. జట్టులో పృథ్వీ తప్ప మరో ప్రతిభావంతుడు లేడా? అంటే కాదన్నదే సమాధానం. కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌ రూపంలో ఇద్దరు మేటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాహుల్‌ ఆటను ప్రపంచం మొత్తం చూసింది. అతడి బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని కీర్తించింది. 14 మ్యాచ్‌ల్లో 55.83 సగటుతో 670 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, అయిదు అర్ధ సెంచరీలతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. టెక్నిక్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో సమానంగా రాహుల్‌ ఆడగలడంటూ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు పొగడ్తతలతో ముంచెత్తుతుంటారు.

ఫామ్‌, టెక్నిక్‌తో సహా ఏరకంగా చూసినా పృథ్వీ కంటే రాహుల్‌ మెరుగైన బ్యాట్స్‌మనే. అలాంటి ఆటగాడిని పక్కనబెట్టడం వెనుక ఔచిత్యమేంటో జట్టు మేనేజ్‌మెంట్‌కే తెలియాలి. శుభ్‌మన్‌ గిల్‌దీ దాదాపు అలాంటి పరిస్థితే. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 33.84 సగటుతో 440 పరుగులు రాబట్టాడు. రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో వరుసగా 0, 29, 43, 65 ఇన్నింగ్స్‌లు ఆడాడు. టెక్నిక్‌లోనూ తిరుగులేదు. కనీసం గిల్‌కైనా అవకాశం ఇచ్చుంటే సత్తాచాటేవాడేమో!

కంగారూలను ఇప్పుడే దెబ్బ కొట్టాలి..

సొంతగడ్డపై ఆసీస్‌ బలమైన ప్రత్యర్థే అయినా మానసికంగా దుర్భేధ్యమైన జట్టేమీ కాదు. సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గట్టి పోటీ ఇస్తే కంగారూలు నీరుగారిపోతారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎలాగూ విరాట్‌ రెండో టెస్టు నుంచి అందుబాటులో ఉండడు. అతడు ఆడుతున్న తొలి టెస్టులోనే ఆసీస్‌ను మానసికంగా దెబ్బకొడితే దాని ప్రభావం మిగతా మ్యాచ్‌లపైనా ఉంటుంది. టీమ్‌ఇండియా మాత్రం సింహం ముందు పిల్లిని నిలబెట్టినట్లు.. స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ ముందు పృథ్వీని ఉంచడం ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. జట్టులో ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవడంలో టీమ్‌ఇండియా విఫలమైంది. ఆసీస్‌ వంటి అగ్రశ్రేణి జట్లతో మ్యాచ్‌ల్లో ప్రయోగాలు చేయడం ఆత్మహత్యాసదృశమే. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే ఔటైన పృథ్వీ రెండో ఇన్నింగ్స్‌లో తన తప్పుల్ని సరిదిద్దుకుంటే జట్టుతో పాటు అతడికీ లాభమే. మళ్లీ విఫలమైతే మాత్రం భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.