ETV Bharat / sports

పాంటింగ్​ కన్నా స్మిత్​నే అలా అంటాను: ఇషాంత్​ - టీమిండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ.

ఆసీస్​ ఆటగాడు స్మిత్​ను స్లెడ్జింగ్​ చేయటం తనకు ఇష్టమని చెప్పాడు టీమిండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ. గతంలో రికీ పాంటింగ్​, స్మిత్​పై తనదైన హావభావాలు ప్రదర్శించడం నెట్టింట వైరల్​ అయింది. తాజాగా వాటిపై వివరణ ఇచ్చాడీ స్టార్​ పేసర్​.

Steven Smith is the one who I would love to sledge more than Ricky Ponting
పాంటింగ్​ కన్నా స్మిత్​నే అలా అంటాను: ఇషాంత్​
author img

By

Published : Mar 15, 2020, 4:21 PM IST

Updated : Mar 15, 2020, 4:46 PM IST

గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అనేక తరహాలో ప్రత్యర్థి జట్టు క్రీడాకారుల్ని వివిధ రకాలుగా దూషించటం, రెచ్చగొట్టడం చేసేవారు. కానీ, వాళ్లు చేసే పనులకు సమాధానమివ్వడం ఇష్టమంటున్నాడు టీమిండియా బౌలర్​ ఇషాంత్​ శర్మ. ఆసీస్​ మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​ కన్నా స్టీవ్​ స్మిత్​పై స్లెడ్జింగ్​ చేయాలనుకుంటానని చెప్పాడు.

2007లో పెర్త్​ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​ నుంచి రికీ పాంటింగ్​, ఇషాంత్​ మధ్య స్లెడ్జింగ్​ మొదలైంది. అదే విధంగా 2017లో బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో ఇషాంత్​, స్మిత్​ల మధ్య మరో హాస్యాస్పద సన్నివేశం జరిగింది. ఆ మ్యాచ్​లో ఇద్దరూ స్లెడ్జింగ్​ చేసుకున్నారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు పాంటింగ్​ కన్నా స్మిత్​ను స్లెడ్జింగ్​ చేయడానికి ఎక్కువ ఇష్టపడతానని ఇషాంత్​ వెల్లడించాడు.

Steven Smith is the one who I would love to sledge more than Ricky Ponting
పాంటింగ్​ కన్నా స్మిత్​నే అలా అంటాను: ఇషాంత్​

ఇదీ చూడండి.. ప్రాక్టీసు మధ్యలో వదిలిపెట్టి రాంచీకి వెళ్లిన ధోనీ

Last Updated : Mar 15, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.