ETV Bharat / sports

ప్రేక్షకులు లేకుండా క్రికెట్​ కష్టమే: స్మిత్

బయో సెక్యూర్​ వాతావరణం గురించి చెప్పిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. అలా ఆడటం కష్టమేనని అన్నాడు. సెప్టెంబరు 4 నుంచి ఇంగ్లాండ్​తో సిరీస్​ కోసం ఆ దేశానికి వెళ్లింది కంగారూ జట్టు.

Steve Smith
స్టీవ్​ స్మిత్​
author img

By

Published : Aug 23, 2020, 6:04 PM IST

ప్రేక్షకులు లేకుండా క్రికెట్​ ఆడటం భిన్నమైన సవాలేనని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​​ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల సిరీస్ ​కోసం ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబరు 4న ప్రారంభం కానున్న ఈ సిరీస్​లో చెరో మూడు టీ20లు(సౌతాంప్టన్​లో), వన్డేలు(మాంచెస్టర్​లో) జరగనున్నాయి.

Steve Smith
స్టీవ్​ స్మిత్​

"ఈ సిరీస్​లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కానీ, మైదానంలో నన్ను ఉత్సాహపరిచే ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే ఇంగ్లాండ్​ ఆడిన టెస్టులు చూశా. గత కొన్నేళ్లలో వైట్​ బాల్​ క్రికెట్​లో వారు అసాధారణ రీతిలో మెరుగయ్యారు. అందువల్ల ఈ సిరీస్​ రసవత్తరంగా ఉండనుంది. కచ్చితంగా బయో సెక్యూర్​ వాతావరణంలో ఉంటూ.. ఆడటమంటే కాస్త భిన్నమే"

స్టీవ్​ స్మిత్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

ఇది ఓ సవాలుగా అయినప్పటికీ.. సిరీస్​ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు స్మిత్​ చెప్పాడు. ఇన్ని నెలల విరామం తర్వాత తిరిగి క్రికెట్​ ఆడనుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం 21 మందితో జట్టును ఎంపిక చేసింది ఆస్ట్రేలియా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.