ETV Bharat / sports

టీమ్​ఇండియాలో స్మిత్​కు ఇష్టమైన క్రికెటర్? - smith kohli

భారత క్రికెట్ జట్టులో తనకు ఇష్టమైన క్రికెటర్ పేరును వెల్లడించాడు ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్మిత్. అయితే ఇతడు కోహ్లీ పేరు చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

smith
స్మిత్​
author img

By

Published : Jun 15, 2020, 12:44 PM IST

టీమ్​ఇండియాలో తనకు ఇష్టమైన క్రికెటర్​ పేరును చెప్పాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్. యువ ఆటగాడు కేఎల్​ రాహుల్​ ఆట బాగా నచ్చుతుందని చెప్పాడు. అందుకే అతడి బ్యాటింగ్​కు తాను ముగ్ధుడయ్యాడని అన్నాడు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఇన్​స్టా లైవ్​​లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. అయితే కోహ్లీ పేరు చెప్పకపోవడం క్రికెట్ ప్రేమికుల్ని ఆశ్చర్యపరిచింది.

smith insta post
స్మిత్ ఇన్​స్టా పోస్ట్

భారత జట్టులోని స్టార్​ క్రికెటర్లలో రాహుల్​ను ఒకడని, ప్రస్తుతం మంచి ఫామ్​లో ఉన్నాడని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్​ జట్టు ఫాస్ట్​బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాట్స్​మెన్​లో రాహుల్​ ఒకడని తెలిపాడు.

ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాజ్​కు కెప్టెన్​గా ఉన్న రాహుల్​.. 2019 సీజన్​లో అత్యధిక పరుగుల చేసిన బ్యాట్స్​మెన్​లో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం లాక్​డౌన్​తో ఇంట్లో ఉన్న ఇతడు.. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్​లో ఉన్నాడు.

ఇది చూడండి : 'ఆ విషయంలో టీమ్​ఇండియాకు భయం పోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.