ETV Bharat / sports

'వార్నర్​కు టాలీవుడ్​లో అవకాశాలు పక్కా వస్తాయి'

త్వరలో తాను కూడా టిక్​టాక్​లో ఎంట్రీ ఇస్తానని చెప్పాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ స్టీవ్​ స్మిత్​. వార్నర్​ తన డ్యాన్స్​, డైలాగులతో భారత్​లో చాలా క్రేజ్ సంపాదించుకున్నాడని తెలిపాడు.

author img

By

Published : Jun 22, 2020, 2:01 PM IST

Updated : Jun 22, 2020, 2:33 PM IST

'వార్నర్​కు టాలీవుడ్​లో అవకాశాలు పక్కా వస్తాయి'
డేవిడ్ వార్నర్

కొన్నేళ్లుగా తన బ్యాటింగ్​తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. లాక్​డౌన్ ప్రభావంతో టిక్​టాక్​ వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే భారత్​ వ్యాప్తంగా ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు​. అయితే ఇదే బాటలోకి త్వరలో తాను వస్తానని అంటున్నాడు స్టీవ్ స్మిత్. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

వార్నర్​ టిక్​టాక్​ వీడియోలు చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా? నవ్వుతూ, తాను త్వరలోనే టిక్​టాక్​లోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పుకొచ్చాడు.

"లాక్​డౌన్​లో వార్నర్​ చాలా బిజీ అయిపోయాడు. టిక్​టాక్​ వీడియోలతో భారత్​లో విపరీతమైన క్రేజ్​ తెచ్చుకున్నాడు. త్వరలోనే నన్ను కూడా మీరు ఈ మ్యూజిక్​ షేరింగ్​ యాప్​లో చూస్తారు"

-స్మిత్​, ఆస్ట్రేలియా ఓపెనర్​.

వార్నర్ టిక్​టాక్​లో అధికంగా తెలుగు​ స్టార్​ హీరోల డైలాగ్​లు, డ్యాన్స్​లు చేస్తూ కనిపించాడు. మహేశ్​బాబు, ప్రభాస్​, అల్లు అర్జున్​ లాంటి అగ్రహీరోలను అనుకరించాడు. ఈ క్రమంలో అతడికి టాలీవుడ్​లో సినిమా ఛాన్స్​లు తప్పకుండా వస్తాయని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్​ లక్ష్మణ్​ అన్నాడు.

ఇది చూడండి : 'ఐసీసీ, ముందు ఆ విషయంపై అవగాహన కల్పించాలి'

Last Updated : Jun 22, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.