ETV Bharat / entertainment

'NBK109' క్రేజీ అప్డేట్- బాలయ్య కోసం 2 పవర్​ఫుల్ టైటిల్స్! - BALAKRISHNA NBK 109 TITLE

బాలయ్య- బాబీ మూవీ కోసం పవర్ ఫుల్ టైటిల్స్ - 'NBK 109' పేరు ఏంటంటే?

Balakrishna NBK 109 Title
Balakrishna (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 12:50 PM IST

Balakrishna NBK 109 Title : నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'NBK 109'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానున్నట్లు మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మేకర్స్ పరిశీలనలో ఆ రెండు పేర్లు!
అయితే 'NBK 109' అనే వర్కింగ్​ టైటిల్​తో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రానికి మేకర్స్ రెండు టైటిల్స్ ను పరిశీలించారట. 'డాకూ మహారాజా', 'సర్కార్ సీతారామ్' అనే రెండు వెరైటీ టైటిల్స్​లో ఈ సినిమాకు ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట. అందులో అభిమానుల అభిరుచికి అనుగుణంగా ఉన్న టైటిల్​ను ఫైనలైజ్ చేస్తారని సమాచారం.

మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా!
ఇక NBK 109 విషయానికి వస్తే, మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. ఇందులో బాలయ్యతో పాటు ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేవోల్‌ విలన్ రోల్ లో మెరవనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే
కాగా, నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 'NBK 109'తో పాటు 'BB4' (బాలకృష్ణ బోయపాటి 4) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నాలుగోసారి కలిసి పనిచేయనున్నారు బాలయ్య. దసరా సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం గురించి అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. అయితే అక్టోబర్ 16న జరగనున్న పూజా కార్యక్రమంతో ఈ సినిమా గ్రాండ్​గా ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 14 రీల్స్‌ ఎంటర్​టైన్​మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె తేజస్విని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'అఖండ' సెంటిమెంట్​తో NBK 109!

బాలయ్య NBK 109 కోసం రాజస్థాన్‌ ఎడారి సెట్‌ - షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే? - NBK 109 Movie Rajasthan Set

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.