Addiction to Online Games is Causing Crimes and Suicides : ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యసనపరులుగా మారి ఎందరినో ఆత్మహత్యలకు కారణమవుతుంది. సరదాగా మొదలై గెలుపోటముల మధ్య ఇరికించి అప్పులపాలు చేస్తోంది. వీటిని తీర్చేందుకు అమాయకులు నేరాలబాట పడుతున్నారు. లేదంటే వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాధితుల్లో విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నవారు అందరూ ఉండటం ఆందోళక కలిగించే విషయం.
- అంబర్‌పేట్‌కు చెందిన 11ఏళ్ల బాలుడు తల్లి ఫోన్‌లో గేమ్ డౌన్‌లోడ్ చేశాడు. వారిచ్చిన టాస్కులు పూర్తిచేసేందుకు, కొత్త ఆయుధాలు కొనేందుకు తల్లి బ్యాంకు ఖాతాలో నగదును ఖర్చు చేశాడు. నగదు విత్‌డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆ తల్లి చూసేసరికి రూ.27లక్షలు మాయం. దీంతో సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసలు విషయం బయటకు వచ్చింది.
- గుడిమల్కాపూర్‌లో ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. రూ.60వేల రుణం తీసుకుని వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు
- 2022లో హైదరాబాద్‌ల్ ఆన్‌లైన్ గేమింగ్ రూ.60వేలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందగా అది 2023 నాటికి రూ.1.60కోట్లకు చేరింది.
- 2024 తొమ్మిది నెలల్లో రూ.2.5కోట్ల మేర ఆన్‌లైన్ గేమింగ్‌తో నష్టపోయినట్లు ఫిర్యాదులు అందాయి.
మాయాలోకంలోకి వెళ్లి : అధిక శాతం మంది యువత, విద్యార్థులు ప్లేయింగ్ గేమ్స్‌కు అడిక్ట్ అవుతున్నారు. ఇక్కట కనిపించే కొత్త ప్రపంచం వినూత్న పాత్రలు కొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మొదట్లో ఆటవిడుపుగా ప్రారంభమై క్రమంగా ఆ పాత్రలన్నింటిలో చేరి తామే అక్కడ యుద్ధం చేయాలి, కొత్త దుస్తులు ధరించాలి అని ఫీల్ అవుతారు. ఆధునిక ఆయుధాలతో శత్రువులపై చేయి సాధించాలనేంతగా అలవాటుపడిపోతారు. ఆటకు బానిసపై వాళ్ల తల్లిదండ్రులకు తెలియకుండా వారి బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, యూపీఐల నుంచి డబ్బులు చెల్లించి ఆన్‌లైన్‌లో చూపించిన విధంగా టాస్కులు పూర్తి చేస్తున్నారు.
- నాంపల్లిలోని ప్రముఖ బ్యాంకు ఉద్యోగి వ్యక్తిగ, విద్యా రుణాలు ఇచ్చే పోస్టులో ఉన్నారు. ఖాతాదారులు జమచేసిన రూ.1.50 కోట్లను తన ఖాతాలోని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తులో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానియ్యాడని, ఆ ఉద్యోగి అప్పులు తీర్చేందుకు మోసానికి తెరలేపినట్లు వెల్లడైంది.
- బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. అవసరమైన డబ్బు కోసం సోషల్ మీడియాల నుంచి మహిళల ఫొటోలు సేకరించేవాడు. వాటిని డేటింగ్ యాప్‌లో పెట్టి నకిలీ ప్రొఫైల్ సృష్టించి విదేశాల్లోని యువతను ఆకట్టుకుని వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. వాటికి బయటపెడతానుంటూ బెదిరింటి వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసేవాడు.
- సికింద్రాబాద్‌లో నగల వ్యాపారి ఇంట్లో వజ్రాలహారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదో తరగతి చదువుతున్న వ్యాపారి కుమారుడే ఆ నగను కాజేసి మరొకరి ద్వారా విక్రయించినట్లు బయటపడింది.
ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ్యసనం - అప్పులు తీర్చలేక వ్యాపారి ఆత్మహత్య