CSL Apprentice Recruitment 2024 : కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 307 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ - 299
- టెక్నీషియన్ అప్రెంటిస్ - 8
- మొత్తం పోస్టుల సంఖ్య - 307
ట్రేడ్ విభాగాలు : ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్/ సివిల్), పెయింటర్ (జనరల్/ మెరైన్), అకౌంటింగ్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ బేకర్.
విద్యార్హతలు :
- అభ్యర్థులు పదో తరగతితోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
- అలాగే ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (వీహెచ్ఎస్ఈ) ఉత్తీర్ఱత కలిగి ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్ 23 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్ :
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 స్టైపెండ్ ఇస్తారు.
- టెక్నీషియన్ అప్రెంటిస్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైపెండ్ అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ : విద్యార్హతల్లో సాధించిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు చెందిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, గుర్తింపు పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 అక్టోబర్ 9
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 23
ముఖ్యాంశాలు
- కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 307 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల.
- ఐటీఐ, ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 అక్టోబర్ 23