క్రికెటర్ శ్రీశాంత్‌పై ఉన్న ఏడేళ్ల దీర్ఘకాలిక బ్యాన్ ఎట్టకేలకు ముగిసింది. అతడు.. 2021లో ప్రారంభమయ్యే దేశవాళీ టోర్నమెంట్ మ్యాచ్‌ల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కానీ, కరోనా కారణంగా దేశవాళీ టోర్నీల నిర్వహణపై బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదు. జనవరి నుంచి ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
ఒకవేళ దేశవాళీ టోర్నమెంట్లకు అనుమతి లభిస్తే కేరళ టీ20 లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు శ్రీశాంత్ సిద్ధమవుతున్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సజన్ కే వర్గీస్ కూడా శ్రీశాంత్ రాకపై ఆనందం వ్యక్తం చేశాడు.
టీ20 లీగ్‌లో రాణిస్తే శ్రీశాంత్‌కు ఐపీఎల్‌లోనూ చోటు దక్కే అవకాశాలున్నాయి. అయితే.. 2013 నుంచి శ్రీశాంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు.