ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్. 2013 తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీలో పాల్గొనడం సహా ఐపీఎల్‌లోనూ ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు.
"2021 ఐపీఎల్ వేలంలో కచ్చితంగా పాల్గొంటా. ఏ జట్టు తీసుకున్నా నా మెరుగైన ప్రదర్శన చేస్తా. కానీ, క్రికెట్ అభిమానిగా చెప్పాలంటే ముంబయి ఇండియన్స్ జట్టుకు సచిన్ తెందూల్కర్ ఆధ్వర్యంలో ఆడాలని ఉంది. ముంబయి జట్టులో ఆడే అవకాశం లభిస్తే సచిన్ దగ్గర విలువైన సలహాలు తీసుకునే వీలుంటుంది".
- శ్రీశాంత్, టీమ్ఇండియా పేసర్
ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో పాటు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు ఆడేందుకైనా ఇష్టమేనని తెలిపాడు శ్రీశాంత్. 2013 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. ఈ లీగ్ జరుగుతున్న క్రమంలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి... ఆస్ట్రేలియా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కోసం ఆ బంతి