కేరళలోని కొచ్చిలో క్రికెటర్ శ్రీశాంత్ ఇంటిలో అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. మంటలకు ఓ గది పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో శ్రీశాంత్ భార్య, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. వారు క్షేమంగా బయటపడ్డారు. అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే గాంధీనగర్, త్రిక్కక్కరలోని అగ్నిమాపక దళాలు... సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశాయి.
ఇటీవలే ఈ కేరళ పేసర్‌పై జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించింది బీసీసీఐ. తాజాగా అంబుడ్స్‌మెన్ డీకే జైన్ ఇచ్చిన ఆదేశాలతో 2020 ఆగస్టులో మళ్లీ క్రికెట్ ఆడనున్నాడు శ్రీశాంత్.
ఇదీ చదవండి...'స్వలాభం కోసం కొంతమంది నాకు మద్దతివ్వలేదు'