కొన్నిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ సోలో నఖ్వినీకి తాజాగా కరోనా సోకింది. ఈ వైరస్ పాజిటివ్‌గా తేలిన మూడో క్రికెటర్ ఇతడు. ఇంతకు ముందు జాఫర్ సర్ఫరాజ్(పాకిస్థాన్), మజీద్ హక్ (స్కాట్లాండ్).. ఈ ప్రాణాంతక మహ్మమారి బారిన పడ్డారు.
2012లో దక్షిణాఫ్రికా తరఫున అండర్-19 ప్రపంచకప్ ఆడిన సోలో.. ప్రస్తుతం దేశీయ లీగ్ల్లోని పలు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అబెర్డెన్షైర్ క్రికెట్ క్లబ్‌కు ఆడుతున్నాడు.