ETV Bharat / sports

కరోనా విషయంలో ఊపిరి పీల్చుకున్న సఫారీ క్రికెటర్లు

గత కొన్నిరోజుల నుంచి క్వారంటైన్​లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది.

కరోనో విషయంలో ఊపిరి పీల్చుకున్న సఫారీలు
దక్షిణాఫ్రికా క్రికెటర్లు
author img

By

Published : Apr 3, 2020, 7:29 PM IST

కరోనా ప్రభావంతో భారత పర్యటనను మధ్యలోనే ఆపేసి, స్వదేశానికి వెళ్లిపోయిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆ జట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షోయబ్ మన్​జ్రా చెప్పారు.

కోహ్లీసేనతో మూడు వన్డేల సిరీస్​ కోసం భారత్​ వచ్చారు సఫారీలు. మొహాలీ వేదికగా గత నెల 12న తొలి మ్యాచ్​ జరగాల్సి ఉన్నా, వర్షం కారణంగా అది నిలిచిపోయింది. అనంతరం కరోనా ప్రభావం వల్ల మొత్తం సిరీస్​నే రద్దు చేశారు.

దీంతో స్వదేశానికి చేరుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు.. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని డాక్టర్ మన్​జ్రా వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.