కరోనా వైరస్ సోకిన బాలీవుడ్ గాయని కనికా కపూర్ బసచేసిన హోటల్లోనే దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి భారత్‌కు వచ్చిన ఆమె.. మార్చి 14 నుంచి 16 వరకు లఖ్‌నవూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. అదే సమయంలో భారత్‌తో రెండో వన్డే కోసం సఫారీసేన ఆ హోటల్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
" కనికా కపూర్ హోటల్‌లోని లాబీలో కొంతమంది అతిథులతో మాట్లాడింది. భారత్‌తో వన్డే కోసం దక్షిణాఫ్రికా జట్టు, ఆ సమయంలో అదే హోటల్‌లో ఉంది. అక్కడ జరిగిన ఓ న్యూస్ ఛానెల్ వార్షిక సమావేశంలోనూ పాల్గొంది. అయితే సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి, ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి జాబితా తయారుచేయాలి"
-తనిఖీల్లో పాల్గొన్న ఓ అధికారి
భారత్‌తో మార్చి 12న జరగాల్సిన తొలి వన్డే వర్షార్పణమైంది. కరోనా ప్రభావంతో మార్చి 15న, మార్చి 18న జరగాల్సిన చివరి రెండు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి.