ETV Bharat / sports

ఏబీ డివిలియర్స్​ రీఎంట్రీ ఆ సిరీస్​తోనే?

author img

By

Published : Mar 4, 2020, 3:58 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌​.. త్వరలో పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. జూన్​లో శ్రీలంకతో జరగనున్న సిరీస్​కు ఇతడు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఐపీఎల్​లోనూ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున​ ఆడనున్నాడీ క్రికెటర్.

South Africa batsmen AB de Villers likely to make international comeback against Sri Lanka in june, 2020
ఏబీ డివిలియర్స్​ ఆ సిరీస్​లో రీఎంట్రీ ఇస్తాడా?

దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌... ఐపీఎల్​ తర్వాతే దక్షిణాఫ్రికా జట్టులో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్​లో శ్రీలంకతో సిరీస్​కు ఇతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. జూన్​ 1లోపు ఇతడు పునరాగమనంపై స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే ఆ జట్టు కోచ్​ మార్క్​ బౌచర్​ డెడ్​లైన్​ విధించాడు. తుది గడువులోగా అభిప్రాయం చెప్తే, పురుషుల టీ20 ప్రపంచకప్​లో స్థానంపైనా ఓ నిర్ణయానికి వస్తామని ఇటీవల బౌచర్​ అన్నాడు. ఏబీతో పాటు ఇమ్రాన్​ తాహిర్​, క్రిస్​ మోరిస్​.. టీ20ల్లోకి పునరాగమనం చేసే అవకాశం ఉంది.

South Africa cricket
కోచ్​ మార్క్​ బౌచర్​

ఈనెల 29 నుంచి మొదలుకానున్న ఐపీఎల్​లో బరిలోకి దిగనున్నాడు ఏబీ డివిలియర్స్​. ఆ తర్వాత ఆ దేశ క్రికెట్​కు సేవలందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత నెల 21 నుంచి ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్​కు ఇతడు బరిలోకి దిగుతాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ జట్టు ఎంపిక చేసే సమయానికి మిస్టర్​ 360 తన నిర్ణయం ప్రకటించకపోవడం వల్ల తుది జట్టులో చోటు దక్కలేదు.

South Africa cricket
డివిలియర్స్​

2018 మేలో అర్ధాంతరంగా క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు ఏబీ. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా, అతడు పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అప్పట్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.