13వ సీజన్‌కు సంబంధించిన ఐపీఎల్-2020 వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర దక్కించుకున్నారు. కంగారూ జట్టు స్పీడ్‌స్టార్ కమిన్స్ రికార్డు ధర పలికాడు. రూ.15.5 కోట్లకు కమిన్స్‌ను కొనుగోలు చేసింది కోల్‌కతా. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన విదేశీ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడీ ఆటగాడు. ఇతడితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌వెల్‌ను రూ.10.75 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ దక్కించుకోగా.. ఫించ్‌ను బెంగళూరు రూ.4.4 కోట్లకు కొనుక్కుంది. ఆసీస్ పేసర్ కౌల్టర్‌నైల్‌ను ముంబయి 8 కోట్లకు కొనుగోలు చేసింది.
తాజాగా ఐపీఎల్ వేలంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. కమిన్స్‌ను కొన్న ధర అంత ఎక్కువేం కాదని అభిప్రాయపడ్డాడు.
" కమిన్స్ ధర పెద్దదేమి కాదని అనుకుంటున్నా. అయితే ఆటగాళ్ల భారీ ధరకు కారణం డిమాండ్. ఇలాంటి చిన్న వేలంలో ఆటగాళ్లు ఎక్కువ ధర దక్కించుకుంటారు. కమిన్స్‌ను కొనుక్కోవడానికి దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా చివరి వరకు పోటీ పడ్డాయి. దిల్లీ జట్టు 15 కోట్ల వరకు వెళ్లిందంటే కారణం జట్టులో డిమాండ్ ఉండటమే. గతంలోనూ ఇదే విధంగా బెన్‌స్టోక్స్ రూ.14.50 కోట్లకు పలికాడు".
-- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
గంగూలీ జట్టు ఇదే...
ఒకవేళ పదకొండు మందితో జట్టు ఎంపిక చేసుకుంటే... అందులో విరాట్ కోహ్లీ సభ్యుడుగా.. రోహిత్‌శర్మ, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓపెనర్లుగా ఎంచుకుంటానని చెప్పాడు. రిషబ్ పంత్‌ను కీపర్‌గా నియమిస్తానని వెల్లడించాడు. కెప్టెన్‌గానూ, కోచ్‌గానూ తానే ఉంటానని అన్నాడు.