భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను ఇతర ఆటగాళ్లతో పోల్చడం మానేయాలని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ముందు ఈ యువ ఆటగాణ్ని నిలదొక్కుకోనివ్వాలని కోరాడు. పంత్ ఆటతీరును పలువురు ఎంఎస్ ధోనీ పోల్చుతున్న క్రమంలో ఈ విధంగా స్పందించారు అశ్విన్. ప్రస్తుతం అతడు వృద్ధమాన్ సాహా నుంచి కీపింగ్‌లో పోటీని ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో రిషభ్.. మరింత బాగా రాణించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నాడు.
"పంత్ భవిష్యత్తులో మరింత పరిణతి కనబరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్‌ను.. ధోనీతో పోల్చుతున్నారు. ఇప్పుడిప్పుడే అతడు నిలదొక్కుకుంటున్న క్రమంలో పోలికలొద్దు."
- రవిచంద్రన్ అశ్విన్, భారత స్పిన్నర్
చెన్నై టెస్ట్‌లో 5/43తో ఆకట్టుకున్న అశ్విన్.. తన కెరీర్లో 29వ సారి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(265)ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సందర్భంగా భజ్జీకి క్షమాపణలు కోరాడు అశ్విన్.
"నేను భజ్జీ పా లాగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తున్నానని.. చిన్నప్పుడు నా సహచరులు చాలా మంది నన్ను ఎగతాళి చేసేవారు. ఆ స్థాయి నుంచి వచ్చిన నేను.. నేడు అతడి రికార్డునే బద్ధలు కొట్టడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అప్పుడు నాకు దీని గురించి తెలియదు. కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. భజ్జూ పా.. ఈ విషయంలో నన్ను మన్నించండి."
- రవిచంద్రన్ అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్
అంతేకాకుండా.. సుదీర్ఘ ఫార్మాట్లో 200 మందిని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌చేసిన తొలి బౌలర్‌గానూ రికార్డు నెలకొల్పాడీ స్పిన్నర్.
ఈ 34 ఏళ్ల ఈ ఆఫ్ స్నిన్నర్ ఇప్పటివరకు 76 టెస్టుల్లో 25.26 సగటుతో 391 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే-619, కపిల్ దేవ్-434, భజ్జీ-417 మాత్రమే అశ్విన్ కంటే ముందున్నారు.
ఇదీ చదవండి: 'చెపాక్ పిచ్ టెస్ట్ మ్యాచ్‌లకు పనికిరాదు'