న్యూజిలాండ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. డేవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్ రాణించారు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు భారీ స్కోరు చేయడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు.
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 131 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్, ఆస్టన్ అగర్ మాత్రమే రాణించారు. 4 వికెట్లు తీసిన ఇష్ సోథి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌథీ, బౌల్ట్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 59 బంతుల్లోనే 99 పరుగులు చేసిన కాన్వేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.
ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఫిబ్రవరి 25న డునెడిన్ వేదికగా జరగనుంది.
ఇదీ చదవండి: 'ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ మనదే!'