ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన భార్య డ్యాని విల్లిస్కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్లో ఉన్ స్మిత్ వివాహమై ఏడాదైన సందర్భంగా ఇన్స్టాలో ఓ ఫొటో షేర్ చేశాడు.
"వివాహమై ఏడాది పూర్తయిన సందర్భంగా నీకు (డ్యాని విల్లిస్) పెళ్లి రోజు శుభాకాంక్షలు. నీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ" -స్టీవ్ స్మిత్ ఇన్స్టా పోస్ట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్న స్మిత్ - డ్యాని గతేడాది సెప్టెంబరు 15న వివాహం ద్వారా ఒక్కటయ్యారు. జులై 2017లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్ సిరీస్లో స్మిత్ అదరగొడుతున్నాడు. 125.16 సగటుతో 751 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు.. మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: అక్కడ 'బాహుబలి'ని బీట్ చేసిన 'సాహో'