గాయం కారణంగా యాషెస్ మూడో టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ డెర్భీషైర్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. సెప్టెంబరు 4 నుంచి ఈ రెండు జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు స్మిత్ ఆడేఅవకాశం ముంది.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమి నష్టపోకుండా 77 పరుగులు చేసింది. అయితే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో స్మిత్ ఇబ్బంది పడ్డాడు. వచ్చేవారం ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఆడే విషయంలో స్పష్టత లేదు.
రెండో టెస్టులో ఇంగ్లీష్ బౌలర్ ఆర్చర్ వేసిన బౌన్సర్ స్మిత్‌కు బలంగా తాకింది. ఈ కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబషేన్ మూడో టెస్టులోనూ ఆడాడు.
మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు శతకాలు చేశాడు స్మిత్. రెండో టెస్టులో 92 పరుగులతో రాణించాడు.
ఇది చదవండి: 'ఇతర క్రీడాకారులకంటే క్రికెటర్లకే గుర్తింపు ఎక్కువ'