స్టీవ్ స్మిత్ వల్లే యాషెస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ముందంజలో ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే కంగారూ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించాడు. స్మిత్ ఒక్కడి వల్లే ఆసీస్ విజయం సాధించలేదని, సమష్టిగా ఆడినందునే రాణిస్తుందని... తెలిపాడు.
"ఆస్ట్రేలియా ముందంజలో ఉండటానికి స్మిత్ ఒక్కడే కారణమని గత వారం నుంచి చాలా మంది అంటున్నారు. అతడు ఒక్కడి వల్లే ఆసీస్ విజయం సాధించిందని నేను అనుకోవడం లేదు. స్మిత్‌తో పాటు జట్టంతా సమష్టిగా రాణించింది" -రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఇప్పటికే 751 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతకం (80) చేసి మరోసారి ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేసిన మొత్తం స్కోరులో 41 శాతం పరుగులు స్మిత్ ఒక్కడే చేశాడు.
ఇదీ చదవండి: అండర్-19 ఆసియాకప్ విజేత భారత్