ETV Bharat / sports

'స్మిత్​కు మళ్లీ కెప్టెన్సీ ఇస్తే రాణిస్తాడు'

author img

By

Published : Dec 8, 2020, 9:28 AM IST

ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్​కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే సత్తాచాటుతాడని అభిప్రాయపడ్డాడు ఆ దేశ టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వేడ్. స్మిత్ మంచి సారథి అని కితాబిచ్చాడు.

Smith has been a great captain says Matthew Wade
'స్మిత్​కు మళ్లీ కెప్టెన్సీ ఇస్తే రాణిస్తాడు'

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌కు మళ్లీ కెప్టెన్సీ ఇస్తే సత్తా చాటుతాడని ఆ దేశ టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ అన్నాడు. భారత్‌తో రెండో టీ20కి రెగ్యులర్‌ కెప్టెన్‌ ఫించ్‌ దూరం కావడం వల్ల తనకు సారథ్యం అప్పగించిన నేపథ్యంలో వేడ్‌ ఇలా వ్యాఖ్యానించాడు.

"మా జట్టులో చాలామంది నాయకులు ఉన్నారు. అందులో నేను ఒకడిని. కానీ మాకు స్మిత్‌ ఉన్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌ అయిన హెన్రిక్స్‌ ఉన్నాడు. మేమంతా జట్టును నడిపించేందుకు ఉమ్మడిగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా స్మిత్‌ మంచి కెప్టెన్‌. మళ్లీ బాధ్యతలు అప్పగిస్తే అతను సత్తా చాటుతాడు"

-వేడ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్

2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినందుకు స్మిత్‌ కెప్టెన్సీ కోల్పోవడమే కాక ఏడాది నిషేధానికి గురయ్యాడు. పునరాగమనం చేసిన తర్వాత కూడా మళ్లీ అతనికి బాధ్యతలు అప్పగించలేదు. ఆసీస్‌ పరిమిత ఓవర్ల జట్లకు ఫించ్‌, టెస్టు జట్టుకు పైన్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.