గతవారం కరోనా బారిన పడిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు మరోసారి పరీక్ష చేయగా వారికి నెగటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం శుక్రవారం పాక్ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేయగా.. వారిలో పది మందికి వైరస్ సోకినట్లు తేలింది. అయితే తాజాగా జరిపిన కరోనా నిర్ధరణ పరీక్షలో ఫఖర్ జమాన్, మహ్మద్ హస్మైన్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, వాహబ్ రియాజ్‌లకు నెగటివ్‌గా వచ్చినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
-
Six players eligible to join side in Worcester following second negative Covid-19 testhttps://t.co/PAVto66nKp pic.twitter.com/vsYDz4P7aM
— PCB Media (@TheRealPCBMedia) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Six players eligible to join side in Worcester following second negative Covid-19 testhttps://t.co/PAVto66nKp pic.twitter.com/vsYDz4P7aM
— PCB Media (@TheRealPCBMedia) June 30, 2020Six players eligible to join side in Worcester following second negative Covid-19 testhttps://t.co/PAVto66nKp pic.twitter.com/vsYDz4P7aM
— PCB Media (@TheRealPCBMedia) June 30, 2020
"జూన్ 26న క్రికెటర్లకు చేసిన కరోనా పరీక్షల తర్వాత.. జూన్ 29 (సోమవారం)న మరోసారి వారికి కొవిడ్ టెస్టు చేయగా అందులో నెగటివ్‌గా తేలింది" అని మంగళవారం ప్రకటన చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. శుక్రవారం క్రికెటర్లకు కరోనా పరీక్షలు చేయించి.. అందులో వైరస్ సోకిన వారి పేర్లను ప్రకటించింది. వారిలో క్రికెటర్ హఫీజ్ తనను తాను పరీక్షించుకోవడానికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించగా.. అందులో వైరస్ సోకలేదని తేలింది. దీంతో షాక్‌కు గురైనా పీసీబీ.. క్రికెటర్లందరికీ మరోసారి కరోనా పరీక్షలు చేయించింది.
వైరస్ పరీక్షలో నెగటివ్‌గా తేలిన ఆరుగురు ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో పాల్గొనడానికి అర్హులని పీసీబీ ప్రకటించింది. వారు ఇంగ్లాండ్ వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేసి.. వెళ్లే సమయాన్ని త్వరలోనే తెలియజేస్తామని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ల మధ్య ఆగస్టు మొదటి వారం నుంచి మూడు టెస్టులు, మూడు టీ20లు ప్రారంభం కానున్నాయి.