ETV Bharat / sports

'దాదా గొప్ప ప్రత్యర్థి.. అంతకుమించి కెప్టెన్'

బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీపై ప్రశంసల జల్లు కురిపించాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. అతడు బలమైన ప్రత్యర్థే కాదు గొప్ప కెప్టెన్ కూడా అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

దాదా గొప్ప ప్రత్యర్థి.. అంతకుమించి కెప్టెన్!

author img

By

Published : Aug 11, 2020, 6:31 PM IST

లాక్​డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్​లు వాయిదా పడ్డాయి. ఆటగాళ్లకు మంచి విరామం దొరికింది. ఈ సమయంలో సామాజిక మాధ్యమాల్లో బిజీగా గడుపుతున్నారు క్రికెటర్లు. ఇంటర్వ్యూలు, చిట్​చాట్​ల్లో పాల్గొంటున్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా యూట్యూబ్​లో పలు విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​లో బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఫొటో షేర్ చేసి అతడి గురించి వెల్లడించాడు. దాదాను పొగడ్తలతో ముంచెత్తాడు.

"నేను ఆడే రోజుల్లో ఏ జట్టు మీదైనా పోటీపడేందుకు సిద్ధంగా ఉండేవాడిని. ఎందుకంటే నాకు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలంటే ఇష్టం. అలాగే నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్రత్యర్థుల్లో సౌరభ్‌ గంగూలీ ఒకరు. అతను బలమైన ప్రత్యర్థే కాదు గొప్ప కెప్టెన్‌ కూడా. అతని నాయకత్వంలో నేను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడాను."

-షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్

కేవలం ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌లోనే ఆడిన ఈ పాక్‌ పేసర్‌ కోల్‌కతా తరఫున మూడు మ్యాచ్‌ల్లో పాల్గొని 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఇక ఐపీఎల్‌లో పాల్గొనలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.