పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు ఈ నెలలో పర్యటించాల్సి ఉండగా.. భద్రత కారణాలతో వెనక్కి తగ్గారు లంక క్రికెటర్లు. ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందానని ట్వీట్ చేశాడు పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.
"లంక ఆటగాళ్ల నిర్ణయంతో చాలా నిరాశ చెందా. పాక్ ఎల్లవేళలా శ్రీలంకకు మద్దతుగా ఉంటుంది. 1996 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు శ్రీలంక పర్యటనకు నిరాకరించాయి. ఆ సమయంలో పాక్ భారత్‌తో కలిసి సహాయం చేసింది. మీ దేశంలో దాడులు జరిగాక పాక్ అండర్-19 జట్టు స్వచ్ఛందంగా లంక పర్యటనకు వచ్చిందని మర్చిపోకండి. మీ బోర్డు సహకరిస్తున్నా, మీరే(ఆటగాళ్లు) అంగీకరించడం లేదు". -షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
శ్రీలంక క్రికెటర్ల భద్రతా అంశాన్ని కారణంగా చూపడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పందించింది.
"శ్రీలంక క్రికెట్ బోర్డు పంపిన లేఖలో ఆటగాళ్ల భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే పీసీబీ వారికి పూర్తిస్థాయి భద్రత అందించాలని నిర్ణయించుకుంది. వారితో మా సంబంధాలు కొనసాగించటానికి సిద్ధంగా ఉన్నాం". -పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాక్ పర్యటనకు వెళ్లేందుకు కెప్టెన్ కరుణరత్నే, సీనియర్ క్రికెటర్ లసిత్ మలింగతో కలిపి పది మంది నిరాకరించారు. తర్వాత ఈ మ్యాచ్‌ల కోసం ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో జట్టు ప్రకటించింది లంక బోర్డు. అయితే తాజాగా పాక్ పర్యటనకు సిద్ధమైన లంక జట్టుకు ఉగ్రముప్పు ఉన్నట్లు వార్తలు రావడం వల్ల ఈ సిరీస్‌లపై సందిగ్ధం కొనసాగుతోంది.
ఇదీ చదవండి...పాక్ పర్యటనకు సిద్ధమైన లంక జట్టుకు ఉగ్రముప్పు!