గత కొన్ని మ్యాచ్‌లలో.. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ విమర్శలు ఎదుర్కొంటున్న భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బ్యాట్‌కు పని చెప్పాడు. శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ.. గబ్బర్ బ్యాటింగ్ తీరు అందరినీ మెప్పించింది. 106 బంతులాడి 98 పరుగులు సాధించాడు ధావన్. ఇందులో 11 ఫోర్లు ఉండగా.. 2 సిక్స్‌లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వన్డేల్లో 31వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు శిఖర్.
నిజానికి.. ధావన్ ఆటను చూస్తే.. సెంచరీ ఖాయం అని అభిమానులు అనుకున్నారు. వ్యక్తిగత స్కోరు 90 దాటేసరికి జోరు తగ్గించిన ధావన్.. సెంచరీవైపు నెమ్మదిగా అడుగులు వేశాడు. మరో రెండు పరుగులు చేస్తే శతకాన్ని అందుకునే వాడే! కానీ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు.
ఇదీ చదవండి: కోహ్లీ ఒక్క సెంచరీతో.. రికార్డుల మోతే!