లాక్‌డౌన్‌తో క్రికెటర్లందరూ ఆటకు దూరమై, ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, అభిమానుల్ని అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. ఇంట్లోనే బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. కుమారుడు జోరావర్‌తో కలిసి ఇండోర్ క్రికెట్లో పాల్గొన్నాడు. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ కామెంటరీ, అభిమానుల కేరింతలను జోడించి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ''క్వారంటైన్ ప్రీమియర్ లీగ్'లో అన్నింటికన్నా ఉత్కంఠ క్షణాలు. ధావన్ వర్సెస్ ధావన్' అని రాసుకొచ్చాడు.
ఇందులో భాగంగా జోరావర్ బౌలింగ్ చేయగా, శిఖర్ బ్యాట్‌తో అదరగొట్టాడు. తండ్రికొడుకులు ఓ దశలో సరదాగా స్లెడ్జింగ్ చేసుకున్నారు. ఇంతకుముందు తనయుడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడు ధావన్.
- View this post on Instagram
Quarantine Premier League ka sabse gripping moment 😅 Dhawan vs Dhawan 💪🏻😈
">
ఇదీ చూడండి : తనయుడితో ధావన్ డ్యాన్స్.. వీడియో వైరల్