పుణెలో జరిగిన తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. ఇంగ్లాండ్‌పై 66 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్‌లో బోణీ కొట్టింది. ధనాధన్ బ్యాటింగ్ చేసిన ధావన్.. కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ సారథి మోర్గాన్.. సరైన భాగస్వామ్యం లేకపోవడం వల్లే తాము ఓడిపోయామని అన్నాడు.
"అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది. అనుభవజ్ఞుడైన క్రికెటర్‌గా ఎలా దానిని అధిగమించాలో నాకు తెలుసు. అలానే పిచ్‌ను బట్టి ఎలాంటి షాట్లు ఆడాలో నిర్ణయం తీసుకుంటాను. పిచ్‌ను అర్ధం చేసుకుని, మా బ్యాటింగ్ విభాగానికి దాని గురించి చెబుతాను" అని ధావన్ చెప్పాడు.
"మేం ప్రమాదకర జట్టని నేను భావిస్తాను. అయితే భారత్‌తో తొలి వన్డేలో ఓటమిపై మాత్రం మా వాళ్లను తప్పుపట్టట్లేదు. టీమ్ఇండియా బాగా బౌలింగ్ చేసింది. మేం చిన్న చిన్న తప్పులు చేశాం కానీ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం" అని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అన్నాడు.
ఇవీ చదవండి: