ETV Bharat / sports

గబ్బా టెస్టులో సుందర్​, ఠాకూర్ రికార్డు భాగస్వామ్యం - సుందర్​ ఠాకుర్​ భాగస్వామ్యం అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్​ఇండియా ఆటగాళ్లు వాషింగ్టన్​ సుందర్​, శార్దుల్​ ఠాకూర్​ కలిసి.. గబ్బా వేదికపై ఏడో వికెట్​కు అత్యధిక పరుగులు జోడించిన ఆటగాళ్లుగా నిలిచారు. ఇద్దరూ అర్ధసెంచరీలతో కదం తొక్కారు. అరంగేట్రంలోనే హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు సుందర్​.

sardul
శార్దూల్​
author img

By

Published : Jan 17, 2021, 11:46 AM IST

Updated : Jan 17, 2021, 12:16 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆల్​రౌండర్​, అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్​లు రికార్డు సృష్టించారు. గబ్బా మైదానంలో ఏడో వికెట్​కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకుముందు ఈ రికార్డు టీమ్ఇండియా మాజీలు కపిల్​ దేవ్​, మనోజ్​ ప్రభాకర్​ల పేరిట ఉంది. వీరు 1991లో ఏడో వికెట్​కు 58 పరుగులు జోడించారు. ఇప్పుడా రికార్డును సుందర్​, ఠాకూర్ అధిగమించి​ 123 పరుగులు జోడించడం విశేషం.

టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మూడో జోడీగానూ నిలిచారు.

ఆసీస్‌లో ఏడో వికెట్‌కు గత రికార్డులు..

  • 2018-19 సీజన్‌లో రిషభ్ ‌పంత్‌, రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టులో ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.
  • 1947-48 సీజన్‌లో విజయ్‌ హజారే, హెచ్‌ అధికారి అడిలైడ్‌లో ఏడో వికెట్‌కు 132 పరుగులు సాధించారు.
  • 1991-92 సీజన్‌లో అజారుద్దీన్‌‌, మనోజ్‌ ప్రభాకర్‌ అడిలైడ్‌లో ఏడో వికెట్‌కు 101 పరుగులు జోడించారు.

అరంగేట్రంలోనే..

ఈ క్రమంలోనే అరంగేట్ర టెస్టులో అర్ధశతకం(50కు పైగా పరుగులు) సహా మూడు వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్​గా సుందర్​ ఘనత సాధించాడు. అంతకుముందు 1947-48లో ఆసీస్​పైనే దత్తు ఫాద్కర్​(51, 3/14) ఈ రికార్డు నెలకొల్పిన తొలి టీమ్​ఇండియా ఆటగాడు.

టీమ్​ఇండియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్​ స్కోరుకు చేరువలో ఉంది. ప్రస్తుతం 104 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. ఠాకూర్ 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. క్రీజులో సుందర్​(60), సైనీ(0) ఉన్నారు. ఆసీస్​ స్కోరుకు 54 పరుగుల వెనుకంజలో ఉంది టీమ్​ఇండియా.

Last Updated : Jan 17, 2021, 12:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.