గాయం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమైన టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. ఇంగ్లాండ్‌తో ఫిబ్రవరిలో జరగనున్న తొలి టెస్టులోనూ ఆడకపోవచ్చని సమాచారం. అతడు గాయం నుంచి కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్టులో షమీ ఆడకపోవచ్చు. గాయం నుంచి కోలుకొని, తిరిగి ఫామ్‌లోకి రావడానికి 6 వారాల సమయం పడుతుంది. గాయం మానిన తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ పునరావాసానికి వెళతాడ"ని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కమిన్స్ వేసిన బంతి.. షమీ చేతికి బలంగా తాకడం వల్ల అతడు గాయంతో విలవిలలాడాడు. తన చేతిని పైకి ఎత్తలేకపోయాడు. దీంతో బ్యాటింగ్ కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మంగళవారమే భారత్‌కు బయలుదేరాడు షమీ.
ఇంగ్లాండ్ పర్యటన
భారత్‌లో ఇంగ్లాండ్ పర్యటన వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలలో ఇరు జట్లు తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 28 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇదీ చూడండి: 'టీమ్ఇండియా ఇక పుంజుకోవడం అసాధ్యమే'