టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు. జాతీయ క్రికెక్ అకాడమీలో అతడు నెమ్మదిగా.. బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడనే ఆశలు పెరిగాయి.
-
Always focus on how far you’ve come ,rather than how far you have left to go 💪🏻💪🏻 #TeamIndia #mshami11 pic.twitter.com/rXGOe9JYo3
— Mohammad Shami (@MdShami11) February 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Always focus on how far you’ve come ,rather than how far you have left to go 💪🏻💪🏻 #TeamIndia #mshami11 pic.twitter.com/rXGOe9JYo3
— Mohammad Shami (@MdShami11) February 5, 2021Always focus on how far you’ve come ,rather than how far you have left to go 💪🏻💪🏻 #TeamIndia #mshami11 pic.twitter.com/rXGOe9JYo3
— Mohammad Shami (@MdShami11) February 5, 2021
ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో షమి గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతడి మణికట్టు దెబ్బతిని సిరీస్ నుంచే వైదొలగాల్సి వచ్చింది.
"షమి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. తక్కువ తీవ్రతతో అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే వారంలోగా అతడు ప్రాక్టీస్ పెంచుతాడు. ఆ తర్వాత అతడి సెలక్షన్‌పై నిర్ణయం తీసుకోనున్నారు," అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
చెన్నైలో ఫిబ్రవరి 13 నుంచి జరిగే రెండో టెస్టు సందర్భంగా చివరి రెండు టెస్టులకు తుది జట్టును ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి: 'జడేజా లేడు.. ఇంగ్లాండ్ రెచ్చిపోతోంది'