బంగ్లాదేశ్ ప్రముఖ క్రికెటర్ షకిబుల్ హసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నోరోజులు కష్టపడి, తన ప్రదర్శన ద్వారా తెచ్చుకున్న ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అతడికి చోటివ్వలేదు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). అవినీతి నిరోధక నియమాలను ఉల్లంఘించినందుకు రెండేళ్లు నిషేధం విధించిన ఐసీసీ... తాజాగా అతడి పేరును టీ20 ర్యాంకింగ్స్ నుంచి తీసేసింది.
-
💥 Mohammad Nabi is the No.1 T20I all-rounder in the world 💥
— ICC (@ICC) November 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Players from Scotland, Oman, Kenya, Ireland and UAE also take big strides after the #T20WorldCup Qualifier!
UPDATED @MRFWorldwide ICC T20I Player Rankings 👉 https://t.co/DX80kHAdvr pic.twitter.com/4Mv1z3x78w
">💥 Mohammad Nabi is the No.1 T20I all-rounder in the world 💥
— ICC (@ICC) November 11, 2019
Players from Scotland, Oman, Kenya, Ireland and UAE also take big strides after the #T20WorldCup Qualifier!
UPDATED @MRFWorldwide ICC T20I Player Rankings 👉 https://t.co/DX80kHAdvr pic.twitter.com/4Mv1z3x78w💥 Mohammad Nabi is the No.1 T20I all-rounder in the world 💥
— ICC (@ICC) November 11, 2019
Players from Scotland, Oman, Kenya, Ireland and UAE also take big strides after the #T20WorldCup Qualifier!
UPDATED @MRFWorldwide ICC T20I Player Rankings 👉 https://t.co/DX80kHAdvr pic.twitter.com/4Mv1z3x78w
తాజాగా విడుదల చేసిన పొట్టి ఫార్మాట్‌కు చెందిన ఆల్‌రౌండర్ల జాబితాలో.. అతడికి స్థానం దక్కలేదు. వేటు పడకముందు రెండో స్థానంలో ఉండేవాడు షకీబ్. అయితే ప్రస్తుతం అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ.. టీ20ల్లో ఆల్‌రౌండర్ విభాగంలో అగ్రస్థానం సంపాదించాడు. ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాకు చెందిన మరో ఆటగాడు మహ్మదుల్లా రియాద్ 4వ స్థానంలో ఉన్నాడు.
బౌలర్ల జాబితాలో భారత్ నుంచి దీపక్ చాహర్ 88 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. టాప్ పదిలో తొమ్మిది మంది స్పిన్నర్లే ఉండటం విశేషం.
ఇదే కారణం...
ఓ బుకీ తనని సంప్రదించిన విషయాన్ని షకీబ్.. ఐసీసీలోని అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడం వల్ల అతడిపై రెండేళ్ల నిషేధం పడింది. నేరాన్ని అంగీకరించగా ఐసీసీ అతడికి ఏడాది పాటు మినహాయింపు ఇచ్చింది. షకిబుల్‌కు విధించిన శిక్ష వచ్చే ఏడాది అక్టోబర్ 29న ముగుస్తుంది.
ప్రతిష్టాత్మక పదవికీ..
నిషేధం తర్వాత ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సభ్యుడిగానూ తప్పుకున్నాడు షకిబుల్ హసన్. 2017 అక్టోబర్ నుంచి ఎంసీసీ సభ్యుడిగా కొనసాగుతున్న అతడు ప్రపంచ క్రికెట్ కమిటీ వార్షిక సమావేశాల్లో పాల్గొనేవాడు. ఇకపై ఆ అర్హత కోల్పోయాడు. ఈ ఎంసీసీ క్లబ్‌లో మాజీ ఆటగాళ్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు, అంపైర్లు సభ్యులుగా ఉంటారు.