తొలి టెస్టులో టీమ్‌ఇండియాపై గెలిచిన ఆస్ట్రేలియాకు ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"టీమ్‌ఇండియాలో అసలైన లోటుపాట్లు తెలిశాయి. సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే మంచి అవకాశం ఆస్ట్రేలియాకు దక్కింది. మెల్‌బోర్న్‌లోనూ ఆసీస్ విజయం సాధిస్తే భారత్ కోలుకోవడం చాలా కష్టం. రెండో టెస్టు నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు మరింత ఇబ్బందికరం. 'బాక్సింగ్ డే' టెస్టుకు ముందు భారత జట్టులో పలు మార్పులు చేసుకోవాలి. తుది జట్టులో కోహ్లీ లేనందున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా పంత్‌ను తీసుకోవాలి"
-పాంటింగ్, ఆసీస్ మాజీ క్రికెటర్
తర్వాతి టెస్టులో ఆస్ట్రేలియా మరింత బలంగా మారనుందని, ఒకవేళ వార్నర్ గాయం నుంచి కోలుకుంటే బర్న్స్‌తో కలిసి ఓపెనర్గ వచ్చే అవకాశం ఉందని పాంటింగ్ అన్నాడు. ఇదే జరిగితే గాయపడిన పకోస్కీ మరికొంత కాలం టెస్టుల్లో ఎంట్రీ కోసం వేచిచూడక తప్పదని చెప్పాడు. బర్న్స్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో మెరిసినందున, అతడినే తర్వాతి మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తారని పాంటింగ్ వివరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేయడంలో ఆస్ట్రేలియా కంటే భారత్‌కే ఎక్కువ తలనొప్పి అని అభిప్రాయపడ్డాడు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 36/9 అత్యల్ప స్కోరుకే చేతులెత్తేయడం వల్ల అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.