ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ -ట్వంటీలోభారత మహిళా జట్టుపరాజయం పాలైంది. 112 పరుగుల లక్ష్య ఛేదన కోసంబరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ వ్యాట్ అర్ధ శతకంతో రాణించింది. మిగతా బ్యాట్స్ఉమెన్ విఫలమైనా.. లారెన్ వీన్ఫీల్డ్(29) సహకారంతో భారత అమ్మాయిలకు గెలుపును దూరం చేసింది. 2-0 తేడాతో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానేటీ-ట్వంటీ సిరీస్‌ను కైవసం చేసుకుంది ఇంగ్లండ్.ఇటీవల కివీస్‌తో జరిగిన టీ- ట్వంటీసిరీస్నూకోల్పోయింది టీమిండియా.
అంతర్జాతీయంగా ఇది 600 టీ-ట్వంటీ.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు చేసింది. మిథాలీ రాజ్(20) మినహా ఎవరూ రాణించలేదు. మిగతా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్మృతి మంధానా(12) మరోసారి విఫలమైంది. ఇంగ్లీష్ బౌలర్ కేథరిన్ బ్రంట్ మూడు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించింది.
రాణించిన వ్యాట్
56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడింది ఇంగ్లండ్ బ్యాట్స్ఉమెన్ వ్యాట్(64). వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును పరుగులెత్తించింది. లోరెన్ సహాకారంతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో ఏక్తాభిస్థ్రెండు వికెట్లు తీసింది.