ETV Bharat / sports

'ఐపీఎల్​కు భారీ రేటింగ్ వచ్చింది సెహ్వాగ్​ వల్లే' - ఐపీఎల్​13 వీక్షితులు

వీక్షకుల సంఖ్యలో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ పదమూడో సీజన్‌ చాలా రికార్డులు సృష్టించింది. అయితే దీనికి కారణం సెహ్వాగ్​ అని అన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ. తాజాగా సెహ్వాగ్​ పెట్టిన ఫోటోకు ఈవిధంగా కామెంట్ చేశాడు దాదా.

Verendra Sehwag
'ఐపీఎల్​కు భారీ రేటింగ్ వచ్చింది సెహ్వాగ్​ వల్లే'
author img

By

Published : Nov 21, 2020, 9:31 PM IST

సామాజిక మాధ్యమాల్లో టీమ్ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ఎంతో చురుకుగా ఉంటాడు. ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో ఆసక్తిగా స్పందిస్తుంటాడు. అంతేగాక తన ఫొటోలను, జ్ఞాపకాలను తరచూ పంచుకుంటుంటాడు. శనివారం తాజాగా తన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి 'ఎడమ వైపు ఏది వెళ్లకపోతే మీరు కుడి వైపుకి వెళ్లండి' అని దానికి వ్యాఖ్య జత చేశాడు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆ పోస్ట్‌కు కామెంట్ చేశాడు.

మీరంటే మీరు అని!

"ఏం చెప్పావ్‌ వీరూ.. నువ్వు ఇంకా ఫిట్‌గా, అందంగా ఉన్నావు. ఐపీఎల్‌కు చాలా ఎక్కువ రేటింగ్స్ వచ్చాయంటే దానికి కారణం 'వీరూ కి బైతక్‌' కార్యక్రమమే" అని దాదా కామెంట్ చేశాడు. దీనికి సెహ్వాగ్‌ "ఐపీఎల్ విజయవంతమైందంటే దానికి కారణం మీరు, బీసీసీఐ కార్యదర్శి జై షా" అని బదులిచ్చాడు.

ఐపీఎల్ మ్యాచ్‌లను సెహ్వాగ్‌ 'వీరూ కీ బైతక్' అనే కార్యక్రమంలో విశ్లేషించిన సంగతి తెలిసిందే. రాణించిన క్రికెటర్లును కొనియాడుతూ, గెలుపోటముల కారణాలను వివరించేవాడు. అంతేగాక, విఫలమైన ఆటగాళ్లను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించేవాడు. కాగా, వీక్షకుల సంఖ్యలో యూఏఈ వేదికగా జరిగిన పదమూడో సీజన్‌ రికార్డులు సృష్టించింది.

ఇదీ చదవండి:ఐపీఎల్‌తో జరిగిన మేలు ఇదే: షమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.