తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో అదరగొట్టిన భారత్ అనంతరం బౌలింగ్‌లోనూ శుభారంభం చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగులకే 3 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను ఇబ్బందుల్లో నెట్టింది. అశ్విన్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. జడేజా ఓ వికెట్ తీశాడు. అంతకుముందు మయాంక్ అగర్వాల్(215), రోహిత్(176) బ్యాటింగ్ ప్రదర్శనకు ఫలితంగా 502/7 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది టీమిండియా.
-
STUMPS!
— ICC (@ICC) October 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
R Ashwin and Ravi Jadeja's early strikes leave South Africa three down, trailing by 463, after Mayank Agarwal stars with maiden Test (double) century. #INDvSA SCORECARD 👇https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/5IcVWehE0D
">STUMPS!
— ICC (@ICC) October 3, 2019
R Ashwin and Ravi Jadeja's early strikes leave South Africa three down, trailing by 463, after Mayank Agarwal stars with maiden Test (double) century. #INDvSA SCORECARD 👇https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/5IcVWehE0DSTUMPS!
— ICC (@ICC) October 3, 2019
R Ashwin and Ravi Jadeja's early strikes leave South Africa three down, trailing by 463, after Mayank Agarwal stars with maiden Test (double) century. #INDvSA SCORECARD 👇https://t.co/dCGJ4Pcug5 pic.twitter.com/5IcVWehE0D
భారీ స్కోరు చేయాలనే లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాను ఆరంభంలోనే దెబ్బకొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఓపెనర్ మర్కరమ్‌ను(5) తక్కువ పరుగులకే ఔట్ చేశాడు. అనంతరం థియునిస్ నూ(4) పెవిలియన్‌కు పంపాడు. ఆ సమయంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేన్ను... డకౌట్ చేసి సఫారీలను మరింత కష్టాల్లో నెట్టాడు జడేజా.
తొలి ఇన్నింగ్స్ స్కోరు అధిగమించాలంటే దక్షిణాఫ్రికా ఇంకా 463 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. క్రీజులో డీన్ ఎల్గర్(27), బవుమా(2) ఉన్నారు.
202 పరుగుల ఓవర్‌నైట్ స్కోరు వద్ద రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత ఓపెనర్లు మరోసారి విజృంభించారు. మయాంక్ అగర్వాల్ ద్విశతకంతో అదరగొట్టగా.. రోహిత్ శర్మ 176 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా 7 వికెట్ల నష్టానికి భారత్ 502 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇదీ చదవండి: ముగిసిన భారత తొలి ఇన్నింగ్స్... 502/7 డిక్లేర్