ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 24 పరుగులకే టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జడేజా(77)తో కలిసి మహేంద్ర సింగ్ ధోనీ(50) నిలకడగా ఆడుతూ ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దురదృష్టవశాత్తూ గప్తిల్.. ధోనీని రనౌట్ చేయగా.. టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో దినేశ్ కార్తీక్, ఆ తర్వాత హార్దిక్ పాండ్య.. అనంతరం ధోనీని క్రీజులోకి పంపడంపై విమర్శలు వచ్చాయి. ధోనీని ముందు బ్యాటింగ్‌కు పంపితే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు.
"ధోనీని ఏడో స్థానంలో పంపాలన్న నిర్ణయం నా ఒక్కడిది కాదు. పరిస్థితులను అంచనా వేసే ఈ నిర్ణయానికి వచ్చాం. నెంబర్ 5, 6, 7 స్థానాలకు సంబంధించి మిడిల్ ఆర్డర్‌లో సరళంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. 35వ ఓవర్ తర్వాత ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధోనీ ఎలా ఆడతాడో మనకు తెలుసు. అందుకే సెమీస్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపాం.
-సంజయ్ బంగర్, టీమిండియా బ్యాటింగ్ కోచ్
ప్రపంచకప్ తర్వాత ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది. ఈ సిరీస్‌కు ధోనీ దూరమయ్యాడు. రెండు నెలలు ఆర్మీలో పనిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
ఇవీ చూడండి.. దిల్లీ క్యాపిటల్స్ ఫిజియోగా ప్యాట్రిక్