ETV Bharat / sports

'ఉమ్మి నిషేధం వల్ల రివర్స్​ స్వింగ్​ కష్టమే' - ఐపీఎల్​ భువనేశ్వర్​

​ ఉమ్మి నిషేధం రివర్స్​ స్వింగ్​పై భారీగా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ బౌలర్​ భువనేశ్వర్​ కుమార్​. లాక్​డౌన్​ వల్ల ఆటగాళ్లకు మంచి, చెడు రెండూ జరిగాయని చెప్పిన ఇతడు.. ఈ ఐపీఎల్​ 13వ సీజన్​ బయోబబుల్​లో నిర్వహించడం సరైందన్నాడు.

Bhuvneshwar
భువనేశ్వర్​ కుమార్
author img

By

Published : Sep 10, 2020, 6:21 PM IST

లాక్​డౌన్​ తర్వాత ఐపీఎల్​ కోసం మైదానంలో మళ్లీ ప్రాక్టీస్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆటగాడు భువనేశ్వర్​ కుమార్. ఈ నిర్బంధ సమయం వల్ల క్రికెటర్లకు మంచి, చెడు.. రెండూ జరిగాయని వివరించాడు. అంతకుముందు గాయాలతో ఉన్న కొంతమంది ఆటగాళ్లు ఈ ఐదు నెలల్లో పూర్తిగా కోలుకుని ఫిట్​నెస్​ను సంపాదించుకున్నారని చెప్పాడు. కానీ మరికొంతమంది మాత్రం ఆటపై పట్టు కోల్పోయి ఉండొచ్చన్నాడు. దీంతోపాటు బయో బుడగలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించడం సరైందని అభిప్రాయపడిన భువీ​.. తమ జట్టు సారథి డేవిడ్​ వార్నర్​తో మంచి స్నేహబంధం ఉందని చెప్పుకొచ్చాడు.

భువనేశ్వర్​ కుమార్
భువనేశ్వర్​ కుమార్

అలాగే బంతిపై ఉమ్మి వాడడాన్ని ఐసీసీ బ్యాన్​ చేయడం వల్ల బౌలర్లపై పెద్దగా ప్రభావం చూపదని అన్నాడు భువీ. కానీ బంతి రివర్స్​ సింగ్​ అవ్వడం కష్టమని చెప్పాడు. దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు ఐపీఎల్​ 13వ సీజన్​ జరగనుంది. ప్రస్తుతం క్రికెటర్లందరూ టోర్నీలో గెలుపే లక్ష్యంగా ప్రాక్టీస్​లో చెమటోడుస్తున్నారు.

ఇదీ చూడండి 'రఫేల్​ రాకతో వాయుసేన బలం మరింత పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.