వెస్టిండీస్‌తో లాడర్హిల్ వేదికగా జరిగిన తొలి టీట్వంటీలో ఆకట్టుకున్న నవ్‌దీప్ సైనీ.. ఆ మ్యాచ్‌లో ఐసీసీ నియమావళిని అతిక్రమించినందుకు హెచ్చరికతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను అందుకున్నాడు. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం ట్వీట్ చేసింది.
ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన సైనీ, తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నికోలస్ పూరన్ వికెట్ తీసినప్పుడు అతడ్ని వెళ్లమని దురుసుగా సైగ చేశాడు. ఇది ఐసీసీ నిబంధనలు అతిక్రమించడమే.
"ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5ను సైనీ అతిక్రమించినట్లు తేలింది. పూరన్‌ను ఔట్ చేసిన అనంతరం దూకుడుగా ప్రవర్తించాడు. అందుకే అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేర్చుతున్నాం. ఈ విషయాన్ని ఆ బౌలర్ అంగీకరించాడు." -అంతర్జాతీయ క్రికెట్ మండలి
మూడు మ్యాచ్‌ల టీట్వంటీ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో గెలుచుకుంది టీమిండియా. నామమాత్ర మూడో మ్యాచ్ గయానా వేదికగా మంగళవారం జరగనుంది.
ఇది చదవండి: రెండో టీ-20 టీమిండియాదే.. సిరీస్ కైవసం