ETV Bharat / sports

2007లోనే సచిన్ రిటైర్ కావాలనుకున్నాడు! - 2011 ప్రపంచకప్ సచిన్

గ్రెగ్ ఛాపెల్ కోచ్​గా ఉన్న సమయంలో చేసిన పనుల వల్ల, 2007లోనే సచిన్ రిటైర్ కావాలనుకున్నాడని టీమ్​ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టన్ చెప్పాడు. మాస్టర్​తో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

అతడి వల్ల 2007లోనే సచిన్ రిటైర్ కావాలనుకున్నాడు!
సచిన్ తెందుల్కర్
author img

By

Published : Jun 17, 2020, 7:36 PM IST

టీమ్​ఇండియా కోచ్​గా తాను వచ్చేసరికి, సచిన్ తెందుల్కర్ రిటైర్మెంట్​ ఆలోచనతో ఉన్నాడని గ్యారీ కిర్​స్టన్ చెప్పాడు. అందుకు గల కారణాన్ని వెల్లడించాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లిటిల్ మాస్టర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

"సచిన్​తో నా కోచింగ్ ప్రయాణం అద్భుతం. అయితే నేను కోచ్​గా వచ్చేసరికి తన బ్యాటింగ్ చేస్తున్న స్థానం నచ్చక, క్రికెట్​ను ఎంజాయ్ చేయలేకపోతున్నానని చెప్పాడు. అందుకే రిటైర్మెంట్​ ఇచ్చేయాలని భావిస్తున్నానని అన్నాడు" -గ్యారీ కిర్​స్టన్, టీమ్​ఇండియా మాజీ కోచ్

Gary Kirsten
టీమ్​ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్​స్టన్

అయితే 2008లో గ్యారీ కోచ్​ బాధ్యతలు అందుకున్న తర్వాత, సచిన్​కు బ్యాటింగ్​ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. తనకు నచ్చిన స్థానంలో ఆడే అవకాశమిచ్చాడు. దీంతో మూడేళ్లలో 18 సెంచరీలు, ఓ ద్విశతకం చేశాడు లిటిల్ మాస్టర్.

గ్యారీ కంటే ముందు భారత కోచ్​గా పనిచేసిన గ్రెగ్ ఛాపెల్.. 2007 ప్రపంచకప్​లో సచిన్ బ్యాటింగ్​ స్థానాన్నే మార్చేశాడు. శ్రీలంక, బెర్ముడా మ్యాచ్​ల్లో నాలుగులో వెళ్తానని అడగ్గా, ఆరో స్థానంలో పంపించాడు. ఈ విషయమై కోచ్ ఛాపెల్​తో అప్పటి కెప్టెన్ ద్రవిడ్ వాగ్వాదానికి దిగినా, లాభం లేకుండా పోయింది. మాస్టర్​ను మిడిలార్డర్​లోనే పంపిస్తానని గ్రెగ్​ స్పష్టం చేశాడు. అయితే ఈ టోర్నీలో లీగ్​ దశలోనే ఇంటిముఖం పట్టిన టీమ్​ఇండియా.. అప్పట్లో తీవ్రవిమర్శలు ఎదుర్కొంది.

sachin tendulkar
2007 వన్డే ప్రపంచకప్​ సందర్బంగా సచిన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.