ETV Bharat / sports

'ఓ తండ్రిగా ఏదైనా చేయాల్సిందే'.. తనయుడికి సచిన్ హెయిర్​కట్ - సచిన్ తెందూల్కర్ హెయిర్​కట్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అతడి తనయుడు అర్జున్​కు హెయిర్ కట్ చేస్తూ కనిపించాడు సచిన్.

సచిన్
సచిన్
author img

By

Published : May 20, 2020, 5:40 AM IST

సచిన్ తెందూల్కర్.. తన క్రికెట్ నైపుణ్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. లాక్​డౌన్ సమయంలో సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోనే ఉంటున్నాడు. తనకు సంబంధించిన ప్రతి వీడియోను షేర్ చేసుకుంటున్నాడు. ఇటీవల తనే సొంతంగా హెయిర్​ కట్ చేసుకున్న మాస్టర్​.. మరోసారి కత్తెర చేతపట్టాడు. కానీ ఈసారి తనయుడు అర్జున్ కోసం.

సచిన్ తన తనయుడు అర్జున్​కు హెయిర్​కట్ చేస్తోన్న వీడియోను తాజాగా నెట్టింట పంచుకున్నాడు. "ఓ తండ్రిగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. వారితో ఆటలు ఆడుకోవడం, జిమ్​లో సహాయపడటం, అందులో భాగంగా వారికి హెయిర్ కట్ చేయడం. మొత్తానికి హెయిర్​ కట్ బాగా కుదిరింది. అర్జున్ నీవెపుడు అందంగానే ఉంటావు. నాకు సహాయపడిన సారాకు కృతజ్ఞతలు" అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు మాస్టర్.

ఇంతకుముందు టీమ్​ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మతో హెయిర్​ కట్ చేయించుకున్నాడు. తాజాగా మరో ఆటగాడు పుజారా కూడా భార్య చేత జుత్తు కత్తిరించుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.