భారత క్రికెట్లో నయావాల్ ఛెతేశ్వర్ పుజారా నేడు 32వ జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలు, సహచర క్రికెటర్లు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ స్టార్ ప్లేయర్ బర్త్‌డే సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ కూడా విషెస్ చెప్పాడు. గుజరాతీ భాషలో పుజారాను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
"పుజారాను ఔట్ చేయాలంటే పూజారి ఆశీర్వాదాలు కావాలి. హ్యాపీ బర్త్‌డే పుజారా" అని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పుజారా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఆటగాడు కావడం వల్ల ఈ భాషలోనే ట్వీట్ చేశాడు సచిన్.
-
પુજારા ને આઉટ કરવા માટે પૂજારી ના આશીર્વાદ ની જરૂરત છે !
— Sachin Tendulkar (@sachin_rt) January 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
જન્મ દિવસ મુબારક !
Have a great one, @cheteshwar1! pic.twitter.com/u5Nyb4RQ9K
">પુજારા ને આઉટ કરવા માટે પૂજારી ના આશીર્વાદ ની જરૂરત છે !
— Sachin Tendulkar (@sachin_rt) January 25, 2020
જન્મ દિવસ મુબારક !
Have a great one, @cheteshwar1! pic.twitter.com/u5Nyb4RQ9Kપુજારા ને આઉટ કરવા માટે પૂજારી ના આશીર્વાદ ની જરૂરત છે !
— Sachin Tendulkar (@sachin_rt) January 25, 2020
જન્મ દિવસ મુબારક !
Have a great one, @cheteshwar1! pic.twitter.com/u5Nyb4RQ9K
సచిన్‌తో పాటు బీసీసీఐ కూడా పుజారాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. "అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, ప్రశాంతతకు మారుపేరైన ఆటగాడికి జన్మదిన శుభాకాంక్షలు" అని ట్వీట్ చేసింది. సహచర ఆటగాళ్లు వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, అశ్విన్, మహ్మద్ కైఫ్ తదితర క్రికెటర్లు పుజారాకు బర్త్‌డే విషెస్ తెలిపారు.
పుజారా టీమిండియా తరుఫున ఇప్పుటి వరకు 75 టెస్టులు ఆడి 5వేల 741 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 5 అంతర్జాతీయ వన్డేలు మాత్రమే ఆడాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌లో 197 మ్యాచ్‌ల్లో 15వేల 188 పరుగులు చేశాడు.