దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్‌కు కొన్ని ప్రేమ సంగతులున్నాయి. తన భార్య అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మాస్టర్.. ఆమె కన్నా ముందు మరొకరికి మనసిచ్చేశాడట. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. అయితే తన ప్రేమ వ్యక్తితో కాకుండా ఆటతో అని వీడియో ద్వారా తెలియజేశాడు.
-
My First Love! 😀 pic.twitter.com/KsYEYyLaxD
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My First Love! 😀 pic.twitter.com/KsYEYyLaxD
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2020My First Love! 😀 pic.twitter.com/KsYEYyLaxD
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2020
లారాకు ప్రత్యర్థిగా..
ఇటీవల ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల కోసం ఛారిటీ మ్యాచ్ నిర్వహించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇందులో బరిలోకి దిగిన లారా సిక్సర్లు, ఫోర్లతో అలరించాడు. సచిన్ కూడా విరామ సమయంలో బ్యాట్ పట్టి.. తన ప్రతిభ తగ్గలేదని నిరూపించాడు. అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాలు.. త్వరలో ప్రత్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. ఇందుకు వాంఖడే మైదానం వేదిక కానుంది. 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్'లో భాగంగా ఈ ఇద్దరూ.. తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకోనున్నారు.
>> ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు పాలుపంచుకుంటాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు మైదానంలో ఆడతారు. సచిన్, లారాతో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా గ్రేట్ బౌలర్ బ్రెట్‌లీ, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూడా ఈ టోర్నమెంటులో కనువిందు చేయనున్నారు. ఈ ఏడాది భారత్ వేదికగా మార్చి 7 నుంచి 22 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఫైనల్ మహరాష్ట్రలోని బ్రబోర్న్ వేదికగా జరగనుంది.
ఇద్దరూ ఇద్దరే...
46 ఏళ్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ అనేక రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో 100 సెంచరీలు సాధించాడు. 2008లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్రియాన్ లారా (11,953) రికార్డుని బద్దలు కొట్టాడు సచిన్. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు లారా. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా లారా పేరిటే రికార్డు ఉంది. 2004లో ఆంటిగ్వా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రియాన్ లారా 400 పరుగులతో అజేయంగా నిలిచి ఈ రికార్డు నెలకొల్పాడు.