మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ పేరు చెబితే క్రికెట్లో అతడు సృష్టించిన లెక్కలేనన్ని రికార్డులు.. అంతకు మించిన ఘనతలు మన కళ్ల ముందు కనిపిస్తాయి. అయితే తన కెరీర్లో ప్రత్యేకమైన వందో శతకం చేసి నేటికి ఎనిమిదేళ్లు. దానిని గుర్తుచేసుకుంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్వీట్ చేసింది.
ఎప్పుడు? ఎక్కడ?
2012 మార్చి 16న బంగ్లాదేశ్ వేదికగా ఆతిథ్య జట్టుతో ఆసియాకప్‌లో టీమిండియా మ్యాచ్. అప్పటికే 99 సెంచరీలు చేసిన సచిన్.. వందో శతకం చేస్తాడా? లేదా? అని అందరిలోనూ ఉత్కంఠ. ఎందుకంటే 99వ సెంచరీ చేసి, అప్పటికే 32 ఇన్నింగ్స్‌లు దాటింది. అయితే అభిమానుల ఆశలను నిజం చేస్తూ, 138 బంతుల్లో శతకం పూర్తి చేశాడు క్రికెట్ దేవుడు. అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో 114 పరుగులు చేసిన సచిన్.. మోర్తజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. క్రీడా ప్రేమికుల్ని బాధకలిగించే విషయం, ఆ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ ఓడిపోవడం.
ఇదే రోజు మాస్టర్ మరో రికార్డు
2005లో ఇదే రోజున పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు సచిన్.
ఇదీ చూడండి.. 'తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా'