ETV Bharat / sports

'ఒత్తిడిని పాజిటివ్​గా తీసుకుంటే విజయం ఖాయం' - హైదరాబాద్​లో సచిన్ తెందూల్కర్

ఏషియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 25వ వార్షికోత్సవంలో పాల్గొన్నాడు భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. క్రికెట్, వైద్యానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్
author img

By

Published : Sep 26, 2019, 9:21 PM IST

Updated : Oct 2, 2019, 3:44 AM IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. హైదరాబాద్​లో జరిగిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 25వ వార్షికోత్సవానికి హాజరయ్యాడు. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా క్రికెట్, వైద్యానికి సంబంధించిన పలు అంశాలపై స్పందించాడు.

ఏషియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 25వ వార్షికోత్సవంలో సచిన్ తెందూల్కర్

టీనేజర్​గా మొట్టమొదటిసారి భారత్ కోసం ఆడిన తొలి మ్యాచ్​ను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు సచిన్. పాకిస్థాన్‌లో జరిగిన ఈ మ్యాచ్ సమయంలో తాను కొంత ఒత్తిడికి గురయ్యాయని, అయితే ఒత్తిడి మనిషిపై ఎప్పుడు ఉండాలని మాస్టర్​ తెలిపాడు. దానిని పాజిటివ్​గా తీసుకుంటే ఎలాంటి విజయాన్నయినా సాధించవచ్చన్నాడు. అదే ఒత్తిడి మనల్ని బాధించేలా ఉంటే తప్పక వదిలించుకోవాలని సూచించాడు.

1998లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్​ను.. సచిన్ వర్సెస్ వార్న్ మ్యాచ్​గా ప్రేక్షకులు చూసేవారని.. అది కొంత ఇబ్బందిగా ఉండేదని అన్నాడు సచిన్. కానీ తాను ఆ మ్యాచ్​ను ఎప్పుడూ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాగానే భావించానని స్పష్టం చేశాడు.

ఇది చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వమని.. బతిమాలా: సచిన్​ తెందూల్కర్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 3:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.