ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది దిల్లీ క్యాపిటల్స్. మూడింటిలో మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడి దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది రాజస్థాన్. ఈ రెండింటి మధ్య జైపూర్ వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది.
రహానే నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్ ఘనమైన విజయాన్ని సాధించాడు. ముంబయిపై జరగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో అటు బ్యాటింగ్‌లోనూ మెప్పించాడు. మరోవైపు సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన దిల్లీ శనివారం పంజాబ్‌ని మట్టికరిపించింది.
రాజస్థాన్ రాయల్స్...
గత మ్యాచ్‌లో ముంబయిపై గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది రాజస్థాన్. 161 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. రియాన్ పరాగ్ 43 పరుగులతో సత్తాచాటగా, సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు. ఓపెనర్ అజింక్యా రహానే ఫామ్‌లోకి రావాల్సి ఉంది. బౌలర్లలో శ్రేయాస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్ నిలకడగా రాణిస్తున్నారు. ఇప్పటికే ఆరింటిలో ఓడిపోయిన రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండటం రాయల్స్‌కు కలిసొచ్చే అంశం. ఈ సీజన్లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్య ఛేదనలో చతికిలపడింది రాజస్థాన్. సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
-
A couple of sitters on his Royal Reaction debut! 💯
— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch on to see @JUnadkat 'caught' in the act of taking a few blinders! 😉#HallaBol pic.twitter.com/g1GE6DIRk3
">A couple of sitters on his Royal Reaction debut! 💯
— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2019
Watch on to see @JUnadkat 'caught' in the act of taking a few blinders! 😉#HallaBol pic.twitter.com/g1GE6DIRk3A couple of sitters on his Royal Reaction debut! 💯
— Rajasthan Royals (@rajasthanroyals) April 21, 2019
Watch on to see @JUnadkat 'caught' in the act of taking a few blinders! 😉#HallaBol pic.twitter.com/g1GE6DIRk3
దిల్లీ క్యాపిటల్స్...
ఫీరోజ్ షా కోట్లా వేదికగా పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది దిల్లీ. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. పృథ్వీ షా, రిషభ్ పంత్, ఇంగ్రామ్లతో దిల్లీ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్‌లో రబాడా అత్యధికంగా 21 వికెట్లతో దూసుకెళ్తుండగా, ఇషాంత్ శర్మ, సందీప్‌లు నిలకడగా ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఈ సీజన్లో రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలిచిన మరోసారి అదే ప్రదర్శన చేయాలని భావిస్తోంది దిల్లీ. ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లతో జోరు మీదుంది దిల్లీ క్యాపిటల్స్. ఇప్పటికే ఆరింటిలో గెలిచిన దిల్లీ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లే ఆఫ్‌కు మార్గం సుగమం చేసుకోవాలనుకుంటోంది.
-
Gym sessions ft. #SkipperShreyas and @RishabPant777 🏋🏻
— Delhi Capitals (@DelhiCapitals) April 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Training hard for the next away game! 💪#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/srNBjIlkSQ
">Gym sessions ft. #SkipperShreyas and @RishabPant777 🏋🏻
— Delhi Capitals (@DelhiCapitals) April 21, 2019
Training hard for the next away game! 💪#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/srNBjIlkSQGym sessions ft. #SkipperShreyas and @RishabPant777 🏋🏻
— Delhi Capitals (@DelhiCapitals) April 21, 2019
Training hard for the next away game! 💪#ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/srNBjIlkSQ
జట్ల అంచనా..
- రాజస్థాన్ రాయల్స్:
సంజూ శాంసన్(కీపర్), రహానే, స్మిత్(కెప్టెన్), స్టోక్స్, టర్నర్, స్టువర్ట్ బిన్ని, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ఉనాద్కత్, ధవల్ కులకర్ణి
- దిల్లీ క్యాపిటల్స్:
శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్(కీపర్), కొలిన్ ఇంగ్రామ్, అక్షర్ పటేల్, రూథర్ ఫర్డ్, రబాడ, అమిత్ మిశ్రా, సందీప్, ఇషాంత్ శర్మ.