ఫన్నీ చేష్టలతో ఎప్పుడూ అభిమానులను అలరిస్తుంటాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. తాజాగా మరోసారి నవ్వులు పూయించడానికి ముందుకొచ్చాడు. తన జట్టులోని సహచర ఆటగాడు క్రిస్ మోరిస్‌తో కలిసి ఫన్నీ డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇటీవల తన ప్రేయసి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు చాహల్. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ కోసం తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్నారు ఆర్సీబీ ఆటగాళ్లు. ఈ జట్టు తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబరు 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
ఇదీ చూడండి 'ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ బుమ్రా'